సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Casting Couch: 60 ఏళ్ల వ్యక్తి తనతో గడపమని అడిగాడంటున్న బాలీవుడ్ నటి.. దాంతో నెలరోజుల పాటు..

ABN, First Publish Date - 2022-09-25T16:38:47+05:30

‘అగ్లే జనమ్ మోహే బితియా హీ కిజో’ టీవీ షోతో గుర్తింపు పొందిన నటి రతన్ రాజ్‌పుత్ (Ratan Rajput). ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానెల్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘అగ్లే జనమ్ మోహే బితియా హీ కిజో’ టీవీ షోతో గుర్తింపు పొందిన నటి రతన్ రాజ్‌పుత్ (Ratan Rajput). ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టి వరుసగా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సాధించింది. ఆ ఛానెల్‌లో మంచి కంటెంట్ ఉంచుతూ వ్యూస్ సాధిస్తోంది. ఇండియాలోని పలు ప్రాంతాల గురించి, ముఖ్యంగా ముంబైలోని ప్రజల జీవితంపై వీడియోలు చేస్తూ అలరిస్తోంది. తాజా ఓ వీడియోని తన ఛానెల్‌లో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. అందులో.. బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ముంబై వచ్చిన కొత్తల్లో ఎదురైన పలు భయంకరమైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.


ఆ వీడియోలో రతన్ మాట్లాడుతూ.. ‘నేను 14 ఏళ్ల క్రితం నటిని కావాలనే కోరికతో ముంబై వచ్చాను. ఆ సమయంలో నాకు కాస్టింగ్ కౌచ్ (casting couch) అనుభవం ఎదురైంది. అవకాశాల కోసం వరుస ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో 60 ఏళ్లు దాటిన ఓ వ్యక్తిని కలిశాను. అతను నన్ను చూసి నా రూపాన్ని, డ్రెస్సింగ్ స్టైల్‌ను అవమానించాడు. ఆమె చాలా మారాలని సూచించాడు. దానికి రెండు లక్షలకు పైగా ఖర్చు అవుతుందని తెలిపాడు. అతన్ని గాడ్‌ఫాదర్‌గా, ఫ్రెండ్‌గా భావించి క్లోజ్‌గా ఉంటే తప్ప.. ఆ పెట్టుబడి పెట్టనని చెప్పాడు. అతనితో గడిపితే దాని గురించి ఆలోచిస్తానని తెలిపాడు.


అది విని నేను చాలా ఆశ్యర్యపోయాను. దాంతో అతనికి తండ్రి వయస్సులో ఉన్న అతనితో ఫ్రెండ్‌గా ఎలా ఉండాలని అడిగాను. దాంతో అతనికి కోపం వచ్చింది. తాను ఉచితంగా ఏం చేయనని, కాస్తా తెలివిగా ఆలోచించమంటూ నా మీదే అరిచాడు. అంతేకాకుండా.. అతని కూతురి నటిగా అవకాశం కోసం వస్తే ఆమెని కూడా సెక్సువల్ ఫేవర్ అడిగేవాడినని జుగుప్సాకరంగా మాట్లాడాడు. దాంతో నెల రోజుల పాటు తెరుకోలేకపోయాను. అనంతరం బాలీవుడ్‌కి కొంచెం కొంచెం దూరమవుతూ వచ్చాను’ అని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా.. ఆ అనుభవం గుర్తొచ్చినప్పుడల్లా భయం వేసేదని రతన్ తెలిపింది. అతను మళ్లీ కనిపిస్తే.. కన్న కూతురి మీదే జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసినందుకు అతడిని చెప్పుతో కొడతానని చెప్పింది. అయితే.. తనతో అంత అసహ్యంగా మాట్లాడేందుకు ఇకపై ఎవరూ సాహసించరని రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-09-25T16:38:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!