సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నీ భర్త Nick Jonas కనుక నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావ్..? అన్న ప్రశ్నకు Priyanka Chopra షాకింగ్ రెస్పాన్స్..!

ABN, First Publish Date - 2022-05-26T23:16:23+05:30

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. ప్రియాంకకు స్వాతంత్ర్య భావాలు ఎక్కువ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. ప్రియాంకకు స్వాతంత్ర్య భావాలు ఎక్కువ. అందువల్ల తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంటుంది. అమెరికన్ నటుడు, సింగర్ అయిన నిక్ జోనాస్(Nick Jonas)ను ప్రియాంక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జోద్‌ఫూర్‌లోని ఉమైద్ భవన్‌లో 2018 డిసెంబరు‌లో ఈ జంట ఏడడుగులు వేశారు. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరు ఒక్కటయ్యారు. గతంలో ప్రియాంక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నిక్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఆమెకు ఎదురైంది. 


ప్రియాంక చోప్రా గతంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది.  ‘‘నీ భర్త నిక్ జోనాస్ కనుక నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావ్..?’’ అనే ప్రశ్నను ప్రియాంకను అడిగారు. ఆ ప్రశ్నకు ప్రియాంక అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చింది. ‘‘మోసం చేయడం అనేది వ్యక్తిగత విషయం. ఓ అబ్బాయి వేరే అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్న తర్వాత అతడితో జీవితాన్ని పంచుకోవాలా వద్దా అనేది ఆమె ఇష్టం. కానీ, అటువంటి వ్యక్తి మాత్రం నాకు దొరికితే మొదట అతడిని బంధించి బాదుతాను. తర్వాత ఏం చేస్తాననే విషయం నాకు తెలియదు. అటువంటి సమయంలో నేను హింసాత్మకంగా మారుతాను. అతడిని క్షమించే అవకాశం కూడా ఉంది. నేను ఆ వ్యక్తిని ఎంత లవ్ చేస్తున్నాననే విషయంపై అది ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం ఇవ్వవచ్చు’’ అని ప్రియాంక చోప్రా చెప్పింది.

Updated Date - 2022-05-26T23:16:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!