కర్మ ఫలితం అందరూ అనుభవించాల్సిందే.. Kangana Ranaut పై Lock Upp రన్నరప్ షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-05-23T16:22:22+05:30 IST

వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోకి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే...

కర్మ ఫలితం అందరూ అనుభవించాల్సిందే.. Kangana Ranaut పై Lock Upp రన్నరప్ షాకింగ్ కామెంట్స్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోకి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ షోలో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ విజేతగా నిలవగా.. పాయల్ రోహత్గీ రన్నరప్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ షోకి మునావర్‌కి దాదాపు 18 లక్షల ఓట్లు వచ్చినట్లు ఆ షోలో హోస్ట్ చెబుతుంది. అయితే.. ఇది నచ్చని పాయల్ షో అయిపోయిన తర్వాత కంగనపై విమర్శలు చేసింది. సల్మాన్ ఖాన్ వల్లే తనకి బదులు మునావర్‌ని విజేతగా ప్రకటించారని షో నిర్వహకులపై కామెంట్స్ చేసింది.


తాజాగా కంగన కొత్త చిత్రం ‘ధాకడ్’ మే 20న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు దారుణంగా కేవలం 50 లక్షల కలెక్షన్లని మాత్రమే సాధించింది. దీనికి సంబంధించిన ట్వీట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పాయల్ మరోసారి కంగనపై విమర్శలు చేసింది. దానికి.. ‘బాధగా ఉంది. కర్మ ఫలితంగా ఖచ్చితంగా అనుభవించాలి. 18 లక్షల ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి ఆ సినిమాను ప్రమోట్ చేయలేదు. అతని అభిమానులు సినిమాని చూడలేదు. ఇలాంటి వ్యక్తి సీతమ్మ తల్లి మీద సినిమా తీయబోతోంది. సీతమ్మ పాత్రని వెక్కిరించే కంగన వంటి మహిళని ఆ తల్లి ఆ పాత్ర చేసేలా చేస్తోంది. ఎందుకంటే సమాజం నిష్పాక్షపాతంగా ఉండాలని చెప్పడానికి’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చింది.


Updated Date - 2022-05-23T16:22:22+05:30 IST

Read more