రచయితగా మారిన బాలీవుడ్ బ్యూటీ Malaika Arora.. శారీరకంగా బావుంటేనే..
ABN , First Publish Date - 2022-06-16T15:37:23+05:30 IST
స్పెషల్ సాంగ్స్ చేసి బాలీవుడ్లో మంచి పాపులారిటీ సాధించిన బ్యూటీ మలైకా అరోరా. గబ్బర్‌సింగ్‌లో చేసిన కెవ్వుకేక సాంగ్‌తో..
స్పెషల్ సాంగ్స్ చేసి బాలీవుడ్లో మంచి పాపులారిటీ సాధించిన బ్యూటీ మలైకా అరోరా. గబ్బర్‌సింగ్‌లో చేసిన కెవ్వుకేక సాంగ్‌తో టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందింది. ఈ బ్యూటీ ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ జిమ్‌తోపాటు యోగా చేస్తూ.. కచ్చితమైన డైట్ ఫాలో అవుతూ ఉంటుంది. అందుకే 47 ఏళ్ల వయస్సులోనూ ఎంతో యంగ్‌గా కనిపిస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా మలైక రచయితగా మారింది. పోషకాల (Nutritions)పై ఈ భామ రాసిన తొలి పుస్తకం త్వరలో విడుదల కానుంది.
ఆ బుక్‌లో ఆరోగ్యానికి సంబంధించి పలు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చర్చించనుంది. పుస్తకం గురించి మలైకా మాట్లాడుతూ.. ‘పుస్తకం రాయడం వల్ల నాలోని భావాలను ఎక్కువ మంది పంచుకునే అవకాశం కలుగుతుంది. శారీరక ఆరోగ్యం బావుంటేనే మానసికంగా బావుంటామని నేను నమ్ముతాను. శరీరం, మసస్సు.. ఈ రెండింటిలో ఏది బాలేకపోయిన మరో దానిపై ప్రభావం పడుతుంది. కాబట్టి శారీరక ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలనేది నా భావన’ అని చెప్పుకొచ్చింది. అయితే.. ప్రచురణ తేదీ లేదా ప్రచురించే సంస్థ పేరును ప్రకటించలేదు.