Ajay Devgn, అక్షయ్ కుమార్ నా సినిమాలను ప్రమోట్ చేయరు: Kangana Ranaut
ABN , First Publish Date - 2022-05-15T18:43:11+05:30 IST
బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో కంగనా రనౌత్ ఒకరు. ఏ విషయం గురించైనా ఎటువంటి బెరుకు లేకుండా..
బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో కంగనా రనౌత్ ఒకరు. ఏ విషయం గురించైనా ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడే ఈ బ్యూటీని అభిమానులు ఫైర్‌బ్రాండ్ అని పిలుచుకుంటూ ఉంటారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ మే 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కంగన బాలీవుడ్ స్టార్ హీరోలపై విమర్శలు చేసింది.
బాలీవుడ్ తనకు సపోర్టు చేయదని, తన సినిమాలను ప్రమోట్ చేయదని కంగన ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. తాజాగా సైతం ఈ భామ.. ‘అజయ్ దేవగణ్ నా సినిమాను ఎప్పటికీ ప్రమోట్ చేయడు. కానీ అతను ఇతర చిత్రాలను ప్రమోట్ చేస్తాడు. అక్షయ్ కుమార్ (Akshay Kumar) నాకు కాల్ చేసి నా ‘తలైవి’ సినిమా బాగుందని, తనకు నచ్చిందని చెబుతాడు. కానీ నా సినిమా ట్రైలర్‌ని షేర్ చేయడంగానీ, ట్రైలర్ గురించి ట్వీట్ చేయడం మాత్రం ట్వీట్ చేయడు. కాబట్టి వారి గురించి ఎవరూ ఏం మాట్లాడినా.. వారి తరుఫున మాట్లాడదటచుకోలేదు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ నా సినిమా సాంగ్ టీజర్‌ని షేర్ చేసి, వెంటనే డిలీట్ చేశారు. దాని గురించి కూడా నేను మాట్లాడను’ అంటూ చెప్పుకొచ్చింది.
కాగా.. అలియా భట్ మూవీ ‘గంగుభాయి కతియావాడి’ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ ఓ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దాని గురించి కంగనా ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ.. ‘కొందరు నటించిన లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో అజయ్ దేవ్‌గణ్ నటిస్తాడు. కానీ నా సినిమాలో మాత్రం చేయడు. ఎందుకంటే నా సినిమాలో నాకు ఎక్కువ పేరు వస్తుందని కావొచ్చు. కానీ ఆయన నా మూవీలో నటించిన, నా సినిమాని అర్జున్ రాంపాల్లాగా సపోర్టు చేసిన ఎంతో కృతజ్ఞతతో చాలా గొప్పగా ఫీల్ అవుతాను. నేను ఇతరుల సినిమాలను సపోర్టు చేసినట్లుగానే నా మూవీని ఇతరులు సపోర్టు చేయాలని కోరుకుంటాను. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘షేర్షా’ వంటి చిత్రాలను అభినందించడానికి, ప్రమోట్ చేయడానికి నేనేప్పుడు ముందే ఉంటాను. నేను సిద్ధార్థ్ మల్హోత్రా గురించి.. అంతెందుకు కరణ్ జోహార్ సినిమా గురించి కూడా మాట్లాడాను. నేను ప్రశంసించాలి అనుకుంటే బహిరంగంగానే చేస్తాను. ఎవరికీ తెలియకుండా కాల్స్ చేసి మాట్లాడను. ఈ పరిస్థితి మారి నాలాగే వారు కూడా భవిష్యత్తులో నా సినిమాలపై స్పందిస్తారని అనుకుంటున్నా’ అని తెలిపింది.