Deepika Padukone: షో కు రమ్మని స్వయంగా ఆహ్వానించిన కరణ్ జోహర్.. రిజెక్ట్ చేసిన దీపిక.. అసలు కారణమేంటంటే..
ABN , First Publish Date - 2022-07-26T22:57:41+05:30 IST
‘కాఫీ విత్ కరణ్’.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో బాషల్లో ప్రసారమయ్యే పాపులర్ షోలలో
‘కాఫీ విత్ కరణ్ (Koffee With Karan)’.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీలో బాషల్లో ప్రసారమయ్యే పాపులర్ షోలలో ఈ చాట్ షోనే మొదటి స్థానంలో ఉంటుంది. ఈ షోకి నార్త్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని.. ఏడో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ షోకి పలువురు సెలబ్రిటీలను తీసుకొచ్చి క్రేజీ ప్రశ్నలు అడుగుతూ వాళ్లని ఇరుకున్న పెడుతూనే.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు కరణ్. ఇప్పటికే పూర్తైన ఆరు సీజన్లలో ఎంతోమంది సెలబ్రిటీలతో కరణ్ ఆడుకుంటూ ఎంటర్టైన్ చేయడం చూశాం. అయినప్పటికీ ఆయన షోకి రావడానికి సెలబ్రిటీలు సైతం రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు.
తాజాగా సీజన్లో సైతం రణ్వీర్ సింగ్, అలియాభట్, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, సమంత రూతుప్రభు, అక్షయ్ కుమార్ ఇప్పటికే పాల్గొన్నారు. తర్వాతి ఎపిసోడ్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే రానున్నారు. అయితే.. ఈ షో గురించి ఓ క్రేజీ వార్త ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకుముందు ఈ చాట్ షోలో తదుపరి ఎపిసోడ్స్‌లో దీపికా పదుకొనే (Deepika Padukone) పాల్గొననున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా న్యూస్ ప్రకారం, ఈ సీజన్ పాల్గొనమని దీపికని కరణ్ పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశాడట.
అయితే.. కరణ్ అభ్యర్థనని దీపిక రిజెక్ట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఈ షోలో పాల్గొనడానికి దీపికకి సరైన కారణం లేదని, అందుకే ఆమె ఈ చాట్ షోకి రావడానికి నిరాకరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లకి సంబంధించి కూడా పలువురు నటుల గురించి ఇలాంటి వార్తలే నెట్టింట హల్చల్ చేశాయి. కానీ.. అనంతరం అవన్నీ పుకార్లుగా తేల్చేస్తూ ఆ నటులు చాలా సంతోషంగా ఈ షోలో పాల్గొన్నారు. దీపిక విషయంలో సైతం ప్రచారం అవుతున్న వార్తలు నిజమా లేక రూమర్స్ మాత్రమేనా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.