సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Death Rumours: ఆయన ఇంకా చనిపోలేదు.. బాలీవుడ్ నటుడి ఆరోగ్యంపై స్పందించిన కూతురు

ABN, First Publish Date - 2022-11-24T17:22:07+05:30

బాలీవుడ్, మరాఠీ చిత్రాలతో గుర్తింపు పొందిన వెటరన్ నటుడు విక్రమ్ గోఖలే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ (Bollywood), మరాఠీ చిత్రాలతో గుర్తింపు పొందిన వెటరన్ నటుడు విక్రమ్ గోఖలే (Vikram Gokhale). అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి నటించారు. 82 సంవత్సరాల ఈ సినీయర్ నటుడు (Veteran Actor) ఆరోగ్యం బాగాలేక ఇటీవలే పూణేలోని ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం చాలా క్లిష్టంగా ఉంది. ఈ తరుణంలో గోఖలే చనిపోయారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అది చూసి చాలా మంది నెటిజన్లు నెట్టింట విచారం కూడా వ్యక్తం చేశారు. అయితే అవన్నీ రూమర్స్ (Rumours) మాత్రమే నంటూ గోఖలే కూతురు తాజాగా చెప్పుకొచ్చారు.


ఓ మీడియాతో గోఖలే కూతురు మాట్లాడుతూ.. ‘వెటరన్ నటుడు విక్రమ్ గోఖలే ఆరోగ్యం పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన ఇంకా మరణించలేదు. ఆయన కోసం ప్రార్థనలు చేయండి’ అని చెప్పుకొచ్చారు. 1990లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘అగ్నిపథ్’లో, 1999లో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ అనే సినిమాలో గోఖలే నటించి మంచి పాపులారిటీ సాధించాడు. ఆయన తాజా మరాఠీ చిత్రం ‘గోదావరి’ ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది.



Updated Date - 2022-11-24T17:22:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!