సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అదో చెత్త స్కూల్.. నాకు అసహ్యం వేసింది: Shahid Kapoor

ABN, First Publish Date - 2022-04-25T18:31:37+05:30

బాలీవుడ్‌లోని మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యువ నటుల్లో షాహిద్ కపూర్ ఒకరు. ‘కబీర్ సింగ్‌’తో మంచి హిట్ అందుకున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని మంచి ఫ్యాన్ బేస్ ఉన్న యువ నటుల్లో షాహిద్ కపూర్ ఒకరు. ‘కబీర్ సింగ్‌’తో మంచి హిట్ అందుకున్న ఈ నటుడు తాజాగా నటించిన చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇటీవలే విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అలాగే షాహిద్ ఫర్ఫామెన్స్‌కి సైతం ప్రశంసలు వచ్చాయి. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన స్కూల్ రోజుల్లో జరిగిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


షాహిద్ మాట్లాడుతూ.. ‘ముంబైలోని నా స్కూల్ అంటే నాకు ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ స్కూల్ అంటే నాకు అసహ్యం. అక్కడి టీచర్స్ నాతో సరిగా ఉండేవారు కాదు. స్టూడెంట్స్ నన్ను ర్యాగింగ్ చేసేవారు. ఇలా చెబుతున్నందుకు క్షమించండి.. కానీ ఇది నిజం. అయితే.. ఢిల్లీలోని స్కూల్ మాత్రం నాకు ఎంతో ఇష్టం. అక్కడ ఎల్‌కేజీ నుంచి నాకు చాలామంది స్నేహితులు ఉండేవారు. అలాంటి మంచి మెమోరీస్ ముంబై స్కూల్‌లో లేవు. అయితే కాలేజ్ లైఫ్ మాత్రం ఎంతో సరదాగా గడిచింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-04-25T18:31:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!