సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్‌లో ధైర్యమున్న నటుడిని నేనే.. యంగ్ హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్

ABN, First Publish Date - 2022-05-26T19:23:51+05:30

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) ఒకరు. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) ఒకరు. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ‘విక్కీ డోనర్ (Vicky Donor)’ సినిమాలో వీర దాతగా వినూత్న పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అనంతరం కూడా విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘అనేక్’. త్వరలో విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


ఆయుష్మాన్ మాట్లాడుతూ.. ‘ఇదో గొప్ప ప్రయాణం. ప్రేక్షకులు నేను చేసిన ప్రయోగాలను ఆదరించారు. ఇది వారు మారుతున్నారు, కొత్త విషయాలను ఆదరిస్తారనే దానికి ఇది గొప్ప ఉదాహరణ. నేను ఈ స్థాయికి అంత సులభంగా రాలేదు. ఎన్నో రిస్కులు తీసుకున్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఇవన్నీ చూసిన తర్వాత బాలీవుడ్‌లోని ధైర్యంగా ప్రయోగాలు చేసే నటుడ్ని నేనొక్కడినే కావొచ్చని అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.


ఆయుష్మాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమా నటుడిగా, నిజమైన వ్యక్తిగా నాకు చాలా తేడా ఉంది. నిజ జీవితంలో నాకు ఎటువంటి బాధ లేదు. కానీ నటుడిగా ఎప్పుడూ ఘర్షణ పడుతూనే ఉంటా. నాలోని ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు’ అని తెలిపాడు. కాగా.. ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం ‘అనేక్’ ట్రైలర్‌ని మే 27న మూవీ టీం విడుదల చేయనుంది.

Updated Date - 2022-05-26T19:23:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!