సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Laal Singh Chaddha Collections: అయ్యయ్యో.. ఆమిర్ ఖాన్ సినిమాకు రెండు రోజుల్లో వచ్చింది అంతేనా..!

ABN, First Publish Date - 2022-08-13T22:24:21+05:30

విభిన్నమైన పాత్రలు, వైవిధ్య భరిత చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నబాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). తాజాగా అతడు నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). టామ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విభిన్నమైన పాత్రలు, వైవిధ్య భరిత చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). తాజాగా అతడు నటించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’ (Forrest Gump) కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ‘లాల్ సింగ్ చడ్డా’ లో కరీనా కపూర్, నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. అతుల్ కులకర్ణి స్క్రీన్ ప్లేను అందించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రానికీ మొదటి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ఫలితంగా మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. రెండు రోజులకు కలపి ఈ మూవీ కలెక్షన్స్ రూ. 20కోట్లను దాటకపోవడం గమనార్హం. 


‘లాల్ సింగ్ చడ్డా’ రాఖీ కానుకగా థియేటర్స్‌లోకి వచ్చింది. మెట్రో ప్రాంతాల్లోని ప్రేక్షకులు ఈ సినిమాని బాగానే ఆదరించారు. మాస్ సర్క్యూట్స్‌లోని వారి నుంచి చిత్రానికి చాలా తక్కువ స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.11.70కోట్ల వసూళ్లను రాబట్టింది. సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడంతో మొదటి రోజే 1300 షోస్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో ఆ కలెక్షన్స్ మరింత తగ్గాయి. ఫలితంగా ఈ చిత్రం రెండో రోజు రూ. 7.26కోట్ల కలెక్షన్స్‌ను మాత్రమే సాధించింది. రెండు రోజులకు గాను ఈ సినిమా రూ. 18.96కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఆమిర్ గత సినిమాలు మొదటి రోజే దాదాపుగా రూ. 20కోట్ల వసూళ్లను రాబట్టాయి. కానీ, ‘లాల్ సింగ్ చడ్డా’ మాత్రం రెండు రోజుల్లోను ఆ కలెక్షన్స్‌ను రాబట్టలేకపోవడం గమనార్హం.

Updated Date - 2022-08-13T22:24:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!