యాంగ్జయిటీ ఏటాక్కి గురయ్యానంటున్న ఆమీర్ ఖాన్ కూతురు.. దానికి దీనికి తేడా ఉందంటూ..
ABN, First Publish Date - 2022-05-01T17:28:06+05:30
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూతరు ఐరా ఖాన్‌కి సైతం సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది...
బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్‌కి సైతం సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందుకే తరచుగా తనకు సంబంధించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. ఈ భామ తాజాగా చేసిన పోస్ట్‌లో తనకు ఎదురైన పలు ఆరోగ్య సమస్యల గురించి పంచుకుంది.
ఐరా చేసిన ఆ పోస్ట్‌లో మిర్రర్ సెల్ఫీని షేర్ చేసింది. దానికి.. ‘నాకు యాంగ్జయిటి ఎటాక్స్ వస్తున్నాయి. నాకు ఆందోళనగా ఉండడం మామూలే. చాలాసార్లు ఇలా జరిగింది. కొన్నిసార్లు ఏడ్చేదాన్ని కూడా. అయితే.. ఇంతకుముందేప్పుడు యాంగ్జయిటీ ఎటాక్స్ రాలేదు. పానిక్, పానిక్ ఏటాక్స్కి ఉన్నట్లుగానే యాంగ్జయిటీకి, యాంగ్జయిటీ ఎటాక్స్‌కి తేడా ఉంది. నాకు తెలిసినంత వరకూ శారీరకంగా చాలా ఇబ్బంది కలిగిస్తాయి. దీనివల్ల గుండె దడ, శ్వాస ఆడకపోవడం, దానికి తోడు ఏడుపు వస్తుంది. నెమ్మదిగా ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు అనిపిస్తుంది.
యాంగ్జయిటీ ఎటాక్స్ నిజంగా భయంకరమైన అనుభూతి కలిగిస్తాయి. గతంలో ఈ ఎటాక్స్ 2 నెలలకు ఒకటి లేదా రెండు సార్లు వచ్చేవి. కానీ ప్రస్తుతం దాదాపు ప్రతి రోజు వస్తోంది. అలా జరిగితే వెంటనే తనకు చెప్పమని నా డాక్టర్ చెప్పారు. ఆ సమయంలో చాలా నిరసంగా అనిపిస్తుంది. తట్టుకోలేక నిద్ర పోవాలని ప్రయత్నిస్తాను. కానీ బాధ వల్ల అది కూడా జరగదు. అందుకే నాలోని భయాలను గుర్తించి, ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ.. ఒకసారి దీని బారినపడితే ఎలా బయటపడాలో చాలామందికి అర్థంకాదు. నా పరిస్థితి అలాగే ఉంది.
అయితే.. నాకో విషయం అర్థం అయ్యింది. ఆందోళనగా ఉన్నప్పుడు ఇష్టమైన మారితో మాట్లాడడం చాలా ఉపయోగపడుతుంది. అలాగే గట్టిగా ఊపరి పీల్చుకోవడం ద్వారా తీవ్రత కొంచెం తగ్గుతుంది. జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి. వాటి ప్రభావం మీ మీద పడకుండా చూసుకోవాలని గుర్తుంచుకోండి’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఈ బ్యూటీకి తమకు తెలిసిన సలహాలు ఇస్తున్నారు.