సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Laal Singh Chaddha OTT release: ఇబ్బందుల్లో ఆమీర్ సినిమా.. సినిమాకి అంతసీన్ లేదంటూ..

ABN, First Publish Date - 2022-08-22T18:47:23+05:30

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)’. కరీనా కపూర్ ఖాన్(Kareena Kapoor), మోనా సింగ్, టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య (Naga Chaitanya) కీలకపాత్రల్లో నటించారు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రిమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. బాలీవుడ్‌లో ఇటీవలే స్టార్ట్ అయిన బాయ్‌కాట్ ట్రెండ్‌ ప్రభావం పడడంతో రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటి వరకూ రూ.50 కోట్ల కలెక్షన్లని మాత్రమే సాధించగలిగింది. ఈ తరుణంలో ఈ మూవీ ఓటీటీ విడుదల గురించి కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.


విడుదలకి ముందు ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమీర్‌ఖాన్ ఓటీటీల(OTT)పై స్పందించాడు. ఆమీర్ మాట్లాడుతూ.. ‘ఓటీటీలు సినిమాలకు పోటీ కాదు. మనమే వాటిని పోటీగా మారుస్తున్నాం. దాన్ని నుంచి బయటపడాలంటే నిర్మాతలు మూవీ విడుదలైన 6 నెలల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలి’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ని ఆరు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తాడని అందరూ అనుకున్నారు.  కానీ, తాజా నివేదికల ప్రకారం.. బాక్సాఫీస్ వద్ద పరాజయం ఈ మూవీ ఓటీటీ విడుదల విషయంలో ఈ నటుడు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.


నివేదికల ప్రకారం.. లాల్ సింగ్ చడ్డా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమీర్ ఖాన్ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇప్పుడు డీల్‌ కుదిరినట్లు కనిపిస్తోంది. సినిమా విడుదలకు ముందే ఆమిర్ 150 కోట్ల రూపాయలను కోట్ చేసి, చైనాలో కూడా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసి ఆరు నెలల సమయం కావాలని అడిగాడు. స్ట్రీమింగ్ దిగ్గజం ఆయన సినిమాకి రూ.50 కోట్లు ఆఫర్ చేయడంతో 6 నెలల కాల పరిమితిని తగ్గించాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా రాణిస్తుందనే నమ్మకంతో ఆమీర్ అడిగే ధరను రూ.125 కోట్లకు సవరించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవడంతో ఈ స్ట్రీమింగ్ దిగ్గజం దానిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో మరో ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు ప్రారంభించారని వినికిడి. ఈ వార్తలు నిజమా లేక రూమర్స్ మాత్రమేనా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2022-08-22T18:47:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!