సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aamir Khan: ఆ రోజున మా సినిమాను విడుదల చేయకపోవడంతో బతికిపోయామంటున్న ఆమిర్

ABN, First Publish Date - 2022-07-27T21:22:25+05:30

మూడు, నాలుగేళ్లకు ఓ సినిమా చేసిన బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). బాలీవుడ్‌లో రూ. 100కోట్లు, రూ. 200కోట్లు, రూ. 300కోట్ల క్లబ్‌ను ప్రారంభించిన హీరో అతడే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు, నాలుగేళ్లకు ఓ సినిమా చేసిన బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే నటుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan). బాలీవుడ్‌లో రూ. 100కోట్లు, రూ. 200కోట్లు, రూ. 300కోట్ల క్లబ్‌ను ప్రారంభించిన హీరో అతడే. చివరగా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అనంతరం నాలుగేళ్ల విరామం తీసుకుని ఆమిర్ ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ఈవెంట్‌లో ఆమిర్ ఖాన్, చిరంజీవి, నాగ చైతన్య (Naga Chaitanya) పాల్గొన్నారు. ఈ ఫంక్షన్‌లో ఆమిర్ ‘కెజియఫ్-2’ (KGF-2)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 


హిందీ ప్రేక్షకులతో సహా తన స్నేహితుల్లో అనేక మంది ‘కెజియఫ్-2’ కోసం ఆసక్తిగా ఎదురు చూశారని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. ‘‘ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ‘కెజియఫ్-2’, ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకే రోజు విడుదల కావాలి. కానీ, దేవుని దయ వల్ల రెడ్ ఛిల్లీస్ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్‌ను ఆలస్యం చేసింది. అందువల్ల మా సినిమాను విడుదల చేయలేక బతికిపోయాం’’ అని ఆమిర్ ఖాన్ చెప్పాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ లో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించింది. వయాకాం ప్రొడక్షన్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. అమెరికన్ క్లాసికల్ ‘ఫారెస్ట్ గంప్’ కు ఇండియన్ రీమేక్‌గా ‘లాల్ సింగ్ చడ్డా’ రూపొందింది.

Updated Date - 2022-07-27T21:22:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!