Singer KK గురించి చాలా మందికి తెలియని 8 నిజాలివి.. సంగీత ప్రపంచంలోకి రాకముందు ఏం చేసేవారంటే..

ABN , First Publish Date - 2022-06-01T20:06:23+05:30 IST

ప్రముఖ గాయకుడు కేకే కోల్‌కతాలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఎంతోమంది..

Singer KK గురించి చాలా మందికి తెలియని 8 నిజాలివి.. సంగీత ప్రపంచంలోకి రాకముందు ఏం చేసేవారంటే..

ప్రముఖ గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నత్) కోల్‌కతాలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఎంతోమంది కేకే అభిమానులు షాక్‌కి గురయ్యారు. 53 ఏళ్ల ఈ గాయకుడు ఆ సిటీలోని ఓ కళాశాల ఫెస్ట్‌లో ప్రదర్శన ఇస్తుండగా అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ని సీఎంఆర్‌ఐ ఆసుపత్రిలో తీసుకెళ్లగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేకే తన మొదటి ఆల్బమ్ ‘పాల్‌’తోనే మంచి పాపులారిటీ, ఫేమ్‌ని సాధించారు. అనంతరం ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో కేకే పాడిన ‘తడప్ తడప్ కే’ సాంగ్‌ ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది. కాగా.. కేకే జీవితం చాలా మందికి తెలియని 8 విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. 


1. సంగీతంలో శిక్షణ తీసుకోవడానికి 1994లో కేకే ముంబై వెళ్లారు. దానికి ముందు ఆయన హోటల్ పరిశ్రమలో పనిచేశారు.


2. సినిమాలో సరైన బ్రేక్ రాకముందు కేకే 3500కి పైగా జింగిల్స్ పాడారు.


3. ఒకసారి తను ఢిల్లీలో ఓ ప్రొగ్రామ్‌‌లో పాటలు పాడుతున్నప్పుడు చూసి కేకేను హరిహరన్ గుర్తించాడు. ఆయనే కేకేని ముంబైకి వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించమని ప్రోత్సహించాడు.


4. హిందీ సినిమాల్లో కేకే పాడిన మొదటి పాట ‘చోడ్ ఆయే హమ్ వో గాలియాన్’. ఆ పాటకి హరిహరన్, సురేశ్ వాడ్కర్, వినోద్ సెహగల్ ఆయన సహ గాయకులుగా ఉన్నారు. విశాల్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది.


5. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ కిశోర్ కుమార్‌ని చూసి ప్రేరణ పొందిన కేకే గాయకుడిగా మారారు.


6. కేకే శిక్షణ పొందిన శాస్త్రీయ సంగీత విద్వాంసుడు కాదు. ఆయన కొన్ని రోజులు సంగీత పాఠశాలకు వెళ్లినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే మానేశారు. అయితే.. పాటను వినడం ద్వారా సంగీతాన్ని నేర్చుకోగలిగినట్లు, అది ఆయనకి దక్కిన వరమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


7. టెలివిజన్ రియాలిటీ షో ‘ఫేమ్ గురుకుల్‌’లో జ్యూరీ సభ్యులలో కేకే ఒకరు. అందులో అరిజిత్ సింగ్ కూడా మరో సభ్యులు. అయితే.. ఆ షో తర్వాత మరే ఇతర రియాల్టీ షోలో కేకే న్యాయనిర్ణేతగా కనిపించలేదు.


8. కేకే హిందీతోపాటు, తమిళం, తెలుగు, మరాఠీ, కన్నడ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ, అస్సామీ వంటి పలు భాషల్లో పాటలు పాడారు.

Updated Date - 2022-06-01T20:06:23+05:30 IST

Read more