Mumbai: కొరియన్ మహిళ యూట్యూబర్‌పై వేధింపులు.. ఇద్దరి అరెస్ట్

ABN , First Publish Date - 2022-12-01T17:25:44+05:30 IST

దక్షిణ కొరియాకి చెందిన ఓ మహిళ యూట్యూబర్‌ని వేధించిన ఇద్దరు యువకులను ముంబై పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు...

Mumbai: కొరియన్ మహిళ యూట్యూబర్‌పై వేధింపులు.. ఇద్దరి అరెస్ట్

దక్షిణ కొరియాకి చెందిన ఓ మహిళ యూట్యూబర్‌ని వేధించిన ఇద్దరు యువకులను ముంబై పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆ మహిళని ఆ వ్యక్తులు వేధించిన వీడియో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ముంబైలో వీధుల్లో తిరిగి ఓ మహిళ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ సందర్భంగా ఓ వ్యక్తితో ఆమె మాట్లాడింది. ఆ సమయంలో ఆ వ్యక్తి చనువు ఎక్కువగా తీసుకుని ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్లాడు. ఆమె వద్దంటున్న వినలేదు. అంతేకాకుండా ఆమెకి ముద్దు పెట్టే ప్రయత్నం కూడా చేశాడు. కానీ అతన్నుంచి విడిపించుకున్న ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది.


ఆ వీడియోని పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.. ‘కొరియన్ మహిళ యూట్యూబర్‌ను వేధించినందుకు మోబీన్ చంద్ మొహమ్మద్ షేక్, మొహమ్మద్ నకీబ్ సద్రియాలం అన్సారీను పోలీసులు అరెస్టు చేశారు. ఖార్ పోలీసులు సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు’ అని రాసుకొచ్చాడు. అలాగే ఆ వీడియోని షేర్ చేసిన ఆ కొరియన్ మహిళ.. ‘నిన్న రాత్రి స్ట్రీమ్‌లో ఒక వ్యక్తి నన్ను వేధించాడు. అతను తన స్నేహితుడితో ఉన్నందున నేను పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అక్కడి నుంచి వచ్చేశాను. కొంతమంది నేను చాలా స్నేహపూర్వకంగా ఉండటం, అతనితో మాట్లాడడం వల్లే ఇది జరిగిందని విమర్శలు చేస్తున్నారు. ఈ సంఘటన స్ట్రీమింగ్ చేయలంటేనే ఆలోచించేలా చేసింది’ అని రాసుకొచ్చింది.





Updated Date - 2022-12-01T17:25:44+05:30 IST