ప్రభాస్ మూడేళ్లు బ్లాక్ చేశారు: నాగ్ అశ్విన్
ABN , First Publish Date - 2021-03-07T05:47:25+05:30 IST
‘‘చిన్నతనం నుంచి జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ తరహా కథలతో సినిమాలు తీయాలని ఉండేది. ఆరేళ్ల క్రితం అనుదీప్ తీసిన షార్ట్‌ఫిల్మ్ చూశా. అందులో కడుపుబ్బా నవ్వుకునేహాస్యంతోపాటు అమాయకత్వమూ కనిపించింది. దాంతో

‘‘చిన్నతనం నుంచి జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ తరహా కథలతో సినిమాలు తీయాలని ఉండేది. ఆరేళ్ల క్రితం అనుదీప్ తీసిన షార్ట్‌ఫిల్మ్ చూశా. అందులో కడుపుబ్బా నవ్వుకునేహాస్యంతోపాటు అమాయకత్వమూ కనిపించింది. దాంతో అనుదీ్‌పను వెతికి పట్టుకుని సినిమా తీయాలనుకున్నా. అదే ‘జాతిరత్నాలు’’ అని నాగ్ అశ్విన్ అన్నారు. ఆయన నిర్మాతగా మారి అనుదీప్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ ముచ్చటించారు.
రెండేళ్లుగా ‘జాతి రత్నాలు’ కథతో ట్రావెల్ అవుతున్నాం. అప్పటి నుంచీ నవీన్ నా దృష్టిలో ఉన్నాడు. తనకి తోడు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఉన్నారు. ఇక, హాస్యానికి కొదవ ఏముంటుంది? అందుకే, ఈ ముగ్గురూ మా జాతిరత్నాలయ్యారు. ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చెప్పాం. ‘మనీ’ ‘అనగనగా ఒకరోజు’ లాంటి కామెడీ ఈ సినిమాలో కనిపిస్తుంది. సమాజానికి అవసరమయ్యే విషయాలను కూడా కథలో చెప్పాం. హ్యుమర్ ఉన్న సినిమా ఇది. ఈ తరహా కథలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మొదట ‘ఆణిముత్యాలు’, ‘సుద్దపూసలు’ టైటిల్స్ అనుకున్నాం. చివరకు దర్శకుడు ‘జాతి రత్నాలు’ ఫైనల్ చేశారు. ఈ జానర్లో సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే నిర్మాతగా మారా. ఈ కథ విషయంలో దర్శకుడికి చిన్నపాటి సలహాలు ఇచ్చానంతే. అనుదీ్పకి, నాకు మధ్య క్రియేటివ్ క్లాష్ రాకుండా చూసుకున్నా. ప్రస్తుతానికి తెలుగులో విడుదల చేస్తున్నాం.
జులై నుంచి రెగ్యులర్ షూట్
లాక్డౌన్ కంటే ముందే ప్రభా్‌సతో ప్రాజెక్టు ఓకే అయ్యింది. ఆయన చాలా కంఫర్టబుల్ పర్సన్. సింపుల్‌గా ఉంటారు.. స్టార్డమ్, బాక్సాఫీసు రికార్డులు, సోషల్ మీడియాకు గురించి అస్సలు పట్టించుకోడు. సినిమా గురించే ఎప్పుడూ మాట్లాడతారు. డెఫినెట్‌గా ప్రభా్‌సతో చేసే సినిమా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందనేది ఇప్పట్లో చెప్పలేను. ప్రస్తుతం ఆ సినిమాకు కావలసిన సామాగ్రిని తయారు చేసుకునే పనిలో ఉన్నాం. జులై నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ఉంది. దీని కోసం మూడేళ్లు నన్ను బ్లాక్ చేసేశారు.
మనమెందుకు వెళ్లకూడదు...
హాలీవుడ్లో తీసిన స్పైడర్‌మ్యాన్’ సినిమా మన మార్కెట్లో విడుదల అవుతున్నప్పుడు మన సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎందుకు వెళ్లకూడదు అని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది. అది ‘బాహుబలి’తో నిజమైంది భవిష్యత్తులో మన మార్కెట్ కూడా విస్తృతం అవుతుందనే నమ్మకముంది.