ఇది నా తొలి సంక్రాంతి సినిమా! బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2021-01-03T05:20:38+05:30 IST

తెలుగులో మాస్‌, యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌ తెరపై కూడా సందడి చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు...

ఇది నా తొలి సంక్రాంతి సినిమా! బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

తెలుగులో మాస్‌, యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌ తెరపై కూడా సందడి చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆదివారం సాయి శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 


‘అల్లుడు శ్రీను’ నుంచి సంక్రాంతికి రిలీజ్‌ కానున్న ‘అల్లుడు అదుర్స్‌’ వరకూ నేను ఎంచుకున్న ప్రతి కథ వైవిధ్యమైనదే! సంతోష్‌ శ్రీన్‌వా్‌సకి హిట్స్‌ ఉన్నాయా లేదా అన్నది నేను పట్టించుకోలేదు. ఆయన చెప్పిన కథ నాకు నచ్చింది. అంతే. గో హెడ్‌ అన్నా. ఇందులో నేను ఆర్కిటెక్ట్‌గా కనిపిస్తా. నా క్యారెక్టర్‌ కొత్తగానూ, స్టైలి్‌షగానూ ఉంటుంది. దర్శకుడు తీర్చిదిద్దిన తీరు అద్భుతం. నటుడిగా నాకు సవాల్‌ విసిరిన పాత్ర ఇది. ఇందులో ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌, వెన్నెల కిశోర్‌ ఇలా మంచి క్యాస్టింగ్‌ ఉంది. సంక్రాంతికి కొత్త అల్లుడిగా ఈసారి థియేటర్స్‌లోకి వొస్తున్నా. సంక్రాంతికి పర్ఫెక్ట్‌ విందు భోజనం లాంటి సినిమా ఇది. నాకు మొదటి సంక్రాంతి సినిమా కావడంతో చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్‌ చేయడానికి ఎవరైనా ముందుకొస్తారు. అలాంటి కథ ఇది. ఓటీటీ రిలీజ్‌ ఆఫర్‌ ఉన్నా థియేటర్‌లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. 


దర్శకుడి మీదే గురి...

నేనొక కథ అంగీకరించాను అంటే అది దర్శకుడి మీద గురితోనే! కథ ఎలాంటిదైనా తెరకెక్కించేది దర్శకుడే కాబట్టి. నా విజన్‌ కన్నా నేను దర్శకుడి విజన్‌ని, ప్రేక్షకుల విజన్‌ని నమ్ముతా. ‘రాక్షసుడు’, ‘సీత’ అలా కొత్తగా ఆలోచించి చేసిన చిత్రాలే. ప్రస్తుతం మాస్‌, యాక్షన్‌ హీరోగా నాకు గుర్తింపు వచ్చింది. ఇకపై చేసే చిత్రాల్లో పక్కింటి అబ్బాయిగా భిన్నంగా ఉండే పాత్రలు చేస్తా. వ్యక్తిగతంగా నాకు యాక్షన్‌, అడ్వెంచర్‌ సినిమాలు ఇష్టం. 


ఫిబ్రవరి నుంచి ‘ఛత్రపతి’

తెలుగు హిట్‌ సినిమా ‘ఛత్రపతి’ సినిమాను నేను హీరోగా హిందీలో తెరకెక్కడం చాలా గర్వంగా ఉంది. అదీ నా కెరీర్‌ ప్రారంభానికి కారణమైన వి.వి.వినాయక్‌గారి దర్శకత్వంలో చేయడం మరింత ఆనందంగా ఉంది. అయితే బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చిన్నచిన్న మార్పులు చేయాలి. ఆ క్యారెక్టర్‌కు సంబంధించి కాస్త బాడీ పెంచాలి.


‘అల్లుడు అదుర్స్‌’ పాటల చిత్రీకరణ, ప్రమోషన్స్‌ పూర్తి కాగానే కసరత్తులు మొదలుపెడతా. బాలీవుడ్‌ నుంచి పిలుపు వస్తుందని, ఆ తలుపులు నాకోసం తెరుచుకుంటాయని అనుకోలేదు. ఫిబ్రవరి చివర్లో ‘ఛత్రపతి’ షూటింగ్‌ మొదలవుతుంది. ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడతాను. అబ్రాడ్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ఓటీటీ ట్రెండ్‌ మొదలైంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఓటీటీ హవా నడుస్తోంది. నాకూ సిరీ్‌సల అవకాశాలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం నా దృష్టంతా సినిమా మీదే!

Updated Date - 2021-01-03T05:20:38+05:30 IST