విడుదలకు ముందే ఈ చిత్రానికి అవార్డుల పంట
ABN , First Publish Date - 2021-12-30T00:24:32+05:30 IST
బాధ్యతారహితమైన ఓ తాగుబోతు.. భార్యకు దూరమై ఒంటరిగా జీవిస్తుంటాడు. ఆ తర్వాత తన ప్రాణాలను ఫణంగా పెట్టి భార్యకు ఎలా దగ్గరయ్యాడు అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే తిరిగి అలాంటి అవకాశం రాదనే విషయాన్ని ప్రధాన పాయింట్‌గా..

శ్రీ శక్తివేల్ సినీ క్రియేషన్ పతాకంపై నిర్మితమైన ‘కాగిత పూక్కల్’ చిత్రం విడుదలకు ముందే పలు అవార్డులను గెలుచుకుంది. నిర్మాత ఎస్. ముత్తుమాణిక్యం కథను సమకూర్చి దర్శకత్వం వహించగా, లోహన్ మాణిక్ హీరోగాను, ప్రియదర్శిని హీరోయిన్‌గాను తొలిసారి వెండితెరకు పరిచయమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఆర్. సుదర్శన్ ఎడిటింగ్, శివభాస్కర్ కెమెరా, దోస్ నందా సంగీతం సమకూర్చారు. బాధ్యతారహితమైన ఓ తాగుబోతు.. భార్యకు దూరమై ఒంటరిగా జీవిస్తుంటాడు. ఆ తర్వాత తన ప్రాణాలను ఫణంగా పెట్టి భార్యకు ఎలా దగ్గరయ్యాడు అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే తిరిగి అలాంటి అవకాశం రాదనే విషయాన్ని ప్రధాన పాయింట్‌గా తీసుకుని ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
ఇప్పటికే చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఈ చిత్రం ఏకంగా 9 అవార్డులను గెలుచుకుంది. వీటిలో టైగర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆషా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఉరువత్తి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, రామేశ్వరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మద్రాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, లిఫ్ట్ ఆఫ్ ఆన్‌లైన్ సెషన్స్, నోబల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ అవార్డు, ఫస్ట్‌టైమ్ ఫిల్మ్ మేకర్ ఆన్‌లైన్ సెషన్స్, ముంబై ఇండియా - ఫిల్మ్ ఫెస్టివల్-22 వంటి అవార్డులు ఉన్నాయి.