పురాతన చికిత్స చేయించుకున్న విష్ణు విశాల్‌

ABN , First Publish Date - 2021-06-13T21:38:40+05:30 IST

తమిళ చిత్రపరిశ్రమలో మంచి ఫామ్‌లో ఉన్న యువ హీరోల్లో విష్ణు విశాల్‌ ఒకరు. పురాతన చికిత్సల్లో ఒకటైన ‘కప్పింగ్‌ థెరఫీ’ని విష్ణు విశాల్‌ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

పురాతన చికిత్స చేయించుకున్న విష్ణు విశాల్‌

తమిళ చిత్రపరిశ్రమలో మంచి ఫామ్‌లో ఉన్న యువ హీరోల్లో విష్ణు విశాల్‌ ఒకరు.  పురాతన చికిత్సల్లో ఒకటైన ‘కప్పింగ్‌ థెరఫీ’ని విష్ణు విశాల్‌ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఎంతో కఠినమైన శిక్షణ - థెరఫీ అంటూ ఆ ఫొటో కింద ట్వీట్‌ చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారులు, సినీ ప్రముఖుల్లో ఈ థెరఫీకి ఎంతో ప్రాచుర్యం ఉంది. ఈయన తాజాగా నటించిన చిత్రం ‘అరణ్య’. ఇందులో దుగ్గుబాటి రానాతో కలిసి నటించారు. అదేసమయంలో విష్ణు విశాల్‌ హీరోగా ‘ఎఫ్‌ఐఆర్‌’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కాగానే ‘మోహన్‌దాస్’ అనే చిత్రంలో నటించారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలా గుత్తాను రెండో వివాహం చేసుకున్నారు. 

Updated Date - 2021-06-13T21:38:40+05:30 IST