ఓటీటీలో విజయ్‌సేతుపతి మరో చిత్రం
ABN, First Publish Date - 2021-07-26T14:32:14+05:30
అంత్యంత బిజీగా ఉన్ననటుడు విజయ్ సేతుపతి. కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఆయన నటించిన పలు చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి.
కోలీవుడ్‌లో అర డజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ అంత్యంత బిజీగా ఉన్ననటుడు విజయ్ సేతుపతి. కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఆయన నటించిన పలు చిత్రాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు సుందర్‌రాజన్ తనయుడు దీపక్ సుందర్‌రాజన్ దర్శకత్వంలో విజయ్ సేతపతి హీరోగా ఓ చిత్రం తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ నటి తాప్సీ, రాధికా శరత్ కుమార్, దేవదర్షిణి, యోగిబాబు తదితరులు నటించారు. ఫ్యాషన్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ షూటింగ్‌ను కరోనా మొదటి దశ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశారు. రెండో దశ లాక్‌డౌన్ కాలంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని కూడా దర్శకనిర్మాతలు ఓటీటీలో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో తాప్సీ నటించివుండటంతో నేషన్‌వైడ్ రిలీజ్ చేయాలన్న టాక్ లేకపోలేదు. అయితే, ఈ చిత్రం టైటిల్‌ను ఖరారు చేసి విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.