అండమాన్‌లోనే ఆ చిత్ర పాటలు చిత్రీకరిస్తారట..
ABN, First Publish Date - 2021-07-20T00:34:22+05:30
అండమాన్ రియల్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందుతున్న ‘వెంగాయ వెడి’ అనే చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సెంథిల్‌నాధన్, డైరెక్టర్ ఆర్.వి. ఉదయకుమార్
అండమాన్ రియల్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందుతున్న ‘వెంగాయ వెడి’ అనే చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సెంథిల్‌నాధన్, డైరెక్టర్ ఆర్.వి. ఉదయకుమార్, వైయాపురి, రమేష్ కణ్ణన్, రమ్య, గౌతమి, చాప్లిన్ బాలు, క్రేన్ మనోహర్, కింగ్ కాంగ్, వెంగళ్‌రావ్, బిర్లా బోస్, అన్బుమణి, సెల్వరఘు, జగనాథన్, పంక్చర్ పాండి వంటి అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ‘శ్రీకంఠ’ చిత్రం హీరో కార్తీక్ శ్రీరామ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా ఇలమిగాను ఎంపిక చేస్తే.. శ్రీమానుజం, ‘అలైపేసి’ అనే సినిమాలో నటించిన అనుకృష్ణ, ‘రూమ్‌మేట్‘, ‘పాపిలోన్’ వంటి చిత్రాల్లో నటించిన కాదంబరి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మధురై, చెన్నైతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, పాటలను మాత్రం అండమాన్‌లోనే చిత్రీకరిస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ పాటలన్నింటినీ అనురాధా శ్రీరామ్, సైంధవి, ప్రసన్న, దీపా మరియం వంటి ప్రముఖ సింగర్లు నేపథ్యగానం చేశారు. కేఎస్. భారతిరాజా, పి. అరుణ్‌రాజ్, ఆర్. వెట్రిలు సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి సీకే ప్రియన్ సంగీతం సమకూర్చుతున్నారు.