సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘వీర వణక్కం’ సాంగ్‌ను ఆవిష్కరించిన సీఎం స్టాలిన్‌

ABN, First Publish Date - 2021-10-23T02:00:51+05:30

ప్రతి యేటా అక్టోబరు 21వ తేదీన నిర్వహించే ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ను పురస్కరించుకుని ‘వీర వణక్కం’ అనే పేరుతో రూపొందించిన వీడియో సాంగ్‌ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గురువారం విడుదల చేశారు. ఈ సాంగ్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి యేటా అక్టోబరు 21వ తేదీన నిర్వహించే ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ను పురస్కరించుకుని ‘వీర వణక్కం’ అనే పేరుతో రూపొందించిన వీడియో సాంగ్‌ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గురువారం విడుదల చేశారు. ఈ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్‌తో కలిసి తమిళనాడు పోలీస్‌ విభాగం రూపొందించింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులను నిర్వహిస్తూ అమరులైన వారిని స్మరించుకుంటూ ఈ వీడియో సాంగ్‌కు రూపకల్పన చేశారు. 


ఈ పాట గురించి సంగీత దర్శకుడు జిబ్రాన్‌ మాట్లాడుతూ, ‘‘వీర వణక్కం’ పాటను కంపోజ్‌ చేయడం ఓ కొత్త అనుభూతినిచ్చింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ఉన్న పోలీసు సోదరుల్లో అసువులు బాసినవారిని అభినందించడానికి పోలీసు విభాగంతో చేతులు కలిపాను. ఒకప్పుడు తిరువళ్ళూరు ఎస్పీగా ఉన్న నా స్నేహితుడు వరుణ్‌కుమార్‌ ఒక రోజున ‘వీర వణక్కం’ పాటను కంపోజ్‌ చేయగలవా అని అడిగారు. దీంతో నా వంతు కృషిగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సమ్మతించాను. ఈ పాటకు గేయరచన పోలీస్‌ అధికారిని శశికళ, వెస్లీలు చేయగా, నేను సంగీతం సమకూర్చాను. దివ్వాంగ కళాకారుడు తిరమూర్తి, శశికళలు ఈ పాటకు స్వరకల్పన చేశారు. ఈ పాట సీఎం స్టాలిన్‌ చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని వివరించారు.



Updated Date - 2021-10-23T02:00:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!