ఆనందంతో ఉప్పొంగుతున్న వరలక్ష్మి!
ABN , First Publish Date - 2021-07-26T01:19:00+05:30 IST
శనివారం రాత్రి ముగ్గురు మంచి వ్యక్తుల్ని కలిశాను. వాళ్లెవరో కాదు గ్లామర్ డాల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్, వాళ్లమ్మాయి ఆరాధ్య అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారు వరలక్ష్మీ శరత్‌కుమార్. వాళ్లు చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయానని ఆమె తెలిపారు.
శనివారం రాత్రి ముగ్గురు మంచి వ్యక్తుల్ని కలిశాను. వాళ్లెవరో కాదు గ్లామర్ డాల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్, వాళ్లమ్మాయి ఆరాధ్య అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారు వరలక్ష్మీ శరత్‌కుమార్. వాళ్లు చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయానని ఆమె తెలిపారు. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం ఇది అంటూ ఉప్పొంగిపోతున్నారు. వాళ్లతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కలయికకు కారణం.. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్ సెల్వన్. ఇందులో ఐశ్వర్యరాయ్, విక్రమ్, త్రిష, కార్తి, శరత్ కుమార్, జయం రవి, ఐశ్వర్యలక్ష్మి, తదితరులు నటిస్తున్నారు. పుదుచ్చేరిలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఐశ్వర్య రాయ్‌తోపాటు శరత్ కుమార్ పాల్గొన్నారు. షూటింగ్ గ్యాప్‌లో వరలక్ష్మి, ఆమె సోదరి పూజ షూటింగ్ స్పాట్‌లో ఐశ్వర్య, అబిషేక్, ఆరాధ్యను కలిశారు. దీనికి కారణమైన నాన్నా మీకు ధన్యవాదాలు. పూజా నువ్వింకా షాక్ నుంచి బయటకి వచ్చినట్టు లేవు కదా!’ అని పేర్కొన్నారు వరలక్ష్మీ.
