సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హీరో సూర్య మొదటి జీతం ఎంతో తెలిస్తే..!

ABN, First Publish Date - 2021-09-27T16:49:35+05:30

తమిళ ప్రముఖ నటుడు శివకుమార్ వారసుడిగా తెరంగేట్రం చేసిన సూర్యకు అంత సులభంగా ప్రేక్షకుల ఆమోదం లభించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ ప్రముఖ నటుడు శివకుమార్ వారసుడిగా తెరంగేట్రం చేసిన సూర్యకు అంత సులభంగా ప్రేక్షకుల ఆమోదం లభించలేదు. కెరీర్ ఆరంభంలో సూర్య చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొన్ని సినిమాల్లో సెకెండ్ హీరో పాత్రలు కూడా చేశాడు. ఆ తర్వాత మెల్లిగా హీరోగా మారి వరుస హిట్లు అందుకుని ప్రతిభ గల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 


సినిమాల్లోకి రాకముందు సూర్య వేరే ఉద్యోగం చేశాడు. నటుడిగా మారాలనే కోరిక లేకపోవడం వల్ల చదువు అయిపోయిన తర్వాత ఓ ఉద్యోగంలో చేరాడు. ఓ దుస్తుల ఎగుమతుల సంస్థలో జాయిన్ అయ్యాడు. రోజుకు 18 గంటల పాటు కష్టపడేవాడు. అక్కడ పనిచేసినందుకు నెల జీతంగా రూ.736 అందుకునేవాడు. ఆ ఉద్యోగం అంత సంతృప్తినివ్వకపోవడంతో తండ్రి అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకుని సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఆరంభంలో కష్టాలు పడినా ఆ తర్వాత సక్సెస్‌ఫుల్ హీరోగా మారాడు. 

Updated Date - 2021-09-27T16:49:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!