బెదిరింపులు తట్టుకోలేక నటి ఆత్మహత్య.. నకిలీ ఎన్సీబీ అధికారులు అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-27T15:34:07+05:30 IST
ఇటీవలీ కాలంలో సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిదన్న విషయం తెలిసిందే. ఈ ఏడు ఎంతోమంది నటులు నార్కోటిక్స్ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు సైతం పడ్డారు...

ఇటీవలీ కాలంలో సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిదన్న విషయం తెలిసిందే. ఈ ఏడు ఎంతోమంది నటులు నార్కోటిక్స్ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు సైతం పడ్డారు. అయితే దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఇద్దరూ వ్యక్తులు ఓ ఔత్సాహిక నటి బెదిరింపులకు గురి చేసి.. ఆమె మరణానికి కారణమై కటాకటాల పాలయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. భోజ్‌పురి సినిమాల్లో నటిస్తున్న 28 నటి జోగేశ్వరి వెస్ట్‌లో రెంట్‌కి ఉంటోంది. ఈ నటి ఇటీవలే తన ఇద్దరూ ఫ్రెండ్స్‌తో కలిసి ఓ హోటల్లో రేవ్ పార్టీలో పాల్గొంది. ఆ సమయంలో సూరజ్ పరదేశి(32), ప్రవీణ్ వాలింబే(28) ఎన్సీబీ అధికారులమని చెప్పుకుంటూ.. డ్రగ్స్ తీసుకున్నందుకు అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో భయపడిన నటి, ఆమె ఫ్రెండ్స్.. మరో దారి ఏదైనా ఉందా అని రిక్వెస్ట్ చేయడంతో 40 లక్షలు డిమాండ్ చేశారు ఆ నకిలీ ఎన్సీబీ అధికారులు. అనంతరం 20 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే అంతా పెద్ద మొత్తానికి రెడీ చేయడానికి ఎంతో ఇబ్బంది పడిన నటి ఒత్తిడి తట్టకోలేక తన అద్దె ఇంట్లోనే డిసెంబర్ 23న ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
దీన్ని సూమోటోగా తీసుకున్న అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసులో నటి స్నేహితుడైన అసిర్ ఖాజీ, మరొకరు కూడా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు సమాచారం ఇవ్వగా వారు పరారీలో ఉన్నారు.