సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయ్ ‘బీస్ట్’ నేపథ్యమిదే!

ABN, First Publish Date - 2021-12-21T22:44:38+05:30

అగ్రహీరో విజయ్‌ - దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ‘బీస్ట్‌’ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. సన్‌ పిక్చర్‌ పతాకంపై నిర్మాత కళానిధి మారన్‌ నిర్మించగా, పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ చిత్రం నిర్మాణ పనులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ అగ్రహీరో విజయ్‌ - దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ‘బీస్ట్‌’ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. సన్‌ పిక్చర్‌ పతాకంపై నిర్మాత కళానిధి మారన్‌ నిర్మించగా, పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ చిత్రం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా, కొత్త సంవత్సరం రోజున టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం, హీరో శివకార్తికేయన్‌ గేయ రచనతో సాగిన ఈ పాటను విజయ్‌ ఆలపించారు.


అయితే, ఈ చిత్రం స్టోరీ గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో విజయ్‌ ఆర్మీ శిక్షణ పొంది కమాండోగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ గతంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌తో ‘కోలమావు కోకిల’ చిత్రాన్ని, శివకార్తికేయన్‌ హీరోగా హ్యూమన్‌ ఆర్గాన్స్‌ స్మగ్లింగ్‌తో ‘డాక్టర్‌’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-21T22:44:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!