ప్రతిభతో పాటు అది కూడా ఉంటే హీరోయిన్ అయిపోవచ్చు: మృణాళిని రవి

ABN , First Publish Date - 2021-11-09T22:51:28+05:30 IST

టిక్‌టాక్‌ వీడియోల ద్వారా సినిమా అవకాశాలను చేజిక్కించుకున్న మృణాళిని రవికి ఈ దీపావళి ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే, ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు చిత్రాలు ‘ఎనిమి’, ‘ఎమ్.జి.ఆర్ మగన్’ దీపావళికి విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో

ప్రతిభతో పాటు అది కూడా ఉంటే హీరోయిన్ అయిపోవచ్చు: మృణాళిని రవి

టిక్‌టాక్‌ వీడియోల ద్వారా సినిమా అవకాశాలను చేజిక్కించుకున్న మృణాళిని రవికి ఈ దీపావళి ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే, ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు చిత్రాలు ‘ఎనిమి’, ‘ఎమ్.జి.ఆర్ మగన్’ దీపావళికి విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వ్యక్తపరిచింది.


ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇపుడు చాలా సినిమాలను పాన్‌ ఇండియాగా తెరకెక్కిస్తున్నారు. దీంతో అన్ని భాషలకు అవసరమయ్యే హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు. అదే సమయంలో తమిళ అమ్మాయిలను ఎవరూ దూరం పెట్టడం లేదు. ప్రతిభతో పాటు అందం ఉంటే ఖచ్చితంగా హీరోయిన్‌ కావొచ్చు. నా వరకు వస్తే.. నేను ప్రతి రోజూ ఏదో ఒక విషయం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తాను. ఇదే నా పాలసీ..’’ అని ఈ ‘గద్దలకొండ గణేష్’ హీరోయిన్ వివరించింది. కాగా ఆమె ప్రస్తుతం కోబ్రా, జాంగో వంటి చిత్రాల్లో నటిస్తోంది.

Updated Date - 2021-11-09T22:51:28+05:30 IST