త్వరలో ‘టెడ్డీ’కి సీక్వెల్
ABN , First Publish Date - 2021-06-17T21:34:27+05:30 IST
హీరో ఆర్య.. ఆయన జీవిత సహచరిణి, హీరోయిన్ సాయేషా నటించిన చిత్రం ‘టెడ్డీ’. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇమామ్ సంగీతం సమకూర్చారు. స్టూడియో గ్రీన్ అధినేత ఙ్ఞానవేల్ రాజా

కోలీవుడ్: హీరో ఆర్య.. ఆయన జీవిత సహచరిణి, హీరోయిన్ సాయేషా నటించిన చిత్రం ‘టెడ్డీ’. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇమామ్ సంగీతం సమకూర్చారు. స్టూడియో గ్రీన్ అధినేత ఙ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్మి నిర్మించారు. మెడికల్ మాఫియా ఇతివృత్తంతో ఈ చిత్ర కథ సాగుతుంది. ‘ఒక బొమ్మలో లీనమైన ఒక యువతి... తనను ఈ స్థితికి తెచ్చిన వారిపై హీరో ఆర్య సహకారంతో ఏ విధంగా పగతీర్చుకున్నదన్నదే ఈ చిత్ర కథ’. దీనికి మెడికల్ స్కామ్‌ను జోడించారు. గత మార్చి 12వ తేదీన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఈనెల 13వ తేదీన బుల్లితెరపై కూడా టెలికాస్ట్ అయింది. ఇదే విషయంపై హీరో ఆర్య తన సందేశాన్ని వీడియో రూపంలో రిలీజ్ చేశారు.
‘‘నేను హీరోగా నటించిన టెడ్డీ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీని చిన్నారులు మళ్ళీమళ్ళీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇమాన్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు టీవీలో ప్రసారమైంది. ప్రస్తుతం ‘టెడ్డీ’ రెండో భాగానికి సంబంధించిన పనులను హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, శక్తి సౌందర్‌రాజన్‌లు కలిసి చూస్తున్నారు. త్వరలోనే ‘టెడ్డీ’ సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందుకోసం నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను’’ అని ఆర్య అందులో పేర్కొన్నారు.