‘శంకర్ దాదా’ గాయకుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-27T13:35:00+05:30 IST

ప్రముఖ తమిళ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన అన్ని భాషల్లో కలిపి దాదాపు 800 పాటలు ఆలపించారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపద పాటల్ని పాడారు.

‘శంకర్ దాదా’ గాయకుడు కన్నుమూత

ప్రముఖ తమిళ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఆయన నివాసంలో ఆదివారం కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు. ఆయన అన్ని భాషల్లో కలిపి దాదాపు 800 పాటలు ఆలపించారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపద పాటల్ని పాడారు. మెగాస్టార్ ‘శంకర్ దాదా యం.బీ.బీయస్’ చిత్రంలో పట్టుపట్టు చేయే పట్టు పాటను ఆయనే పాడారు. తమిళ చిత్రం దిల్ తో వినాయగం సింగర్ గా తొలి పాట పాడారు. అందులో ‘కన్నుకుళ్ళ గెలతి’ పాటతో మంచి పేరు తెచ్చుకున్నారు. ధనుష్ నటించిన ‘తిరుడా తిరుడి’ చిత్రంతో తమిళనాట నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో ధనుష్ తండ్రిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.వినాయగం మృతికి సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియచేశారు.   

Updated Date - 2021-12-27T13:35:00+05:30 IST