శరత్‌ కుమార్‌ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

ABN , First Publish Date - 2021-09-20T17:08:17+05:30 IST

సీనియర్‌ హీరో శరత్‌ కుమార్‌ కొత్త చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ఆదివారం ప్రారంభమైంది. తిరుమలై బాలుస్వామి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ఎం360 డిగ్రీస్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మాత రోష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

శరత్‌ కుమార్‌ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

సీనియర్‌ హీరో శరత్‌ కుమార్‌ కొత్త చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ఆదివారం ప్రారంభమైంది.  సినిమా పేరు ‘సమరన్’.  తిరుమలై బాలుస్వామి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ఎం360 డిగ్రీస్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మాత రోష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడే కథను రాశారు. ఇందులో శరత్‌ కుమార్‌తో పాటు సీనియర్‌ నటి సుహాసిని మణిరత్నం కూడా నటిస్తున్నారు. ‘సమరన్’  కథను నిర్మాత రోష్‌ కుమార్‌ వివరిస్తూ, ‘ఇది పూర్తిగా కుటుంబ కథా నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ ఆలరించేలా నిర్మిస్తున్నాం. నేటి సమాజానికి అవసరమైన మంచి విషయాలు తెలియజెప్పేలా ఉంటుంది. ఈ కథను ఆలకించిన తర్వాత హీరోగా నా ఆలోచనకు వచ్చిన నటుడు శరత్‌కుమారే. 


మట్టి (భూమి)కి సంబంధించిన కథ కావడంతో ఈ పాత్రకు శరత్‌కుమార్‌ సరిగ్గా సరిపోతారు. ఈ కథను విన్న వెంటనే శరత్‌కుమార్‌ నటించేందుకు అంగీకరించారు. ఈ చిత్రంలో చెల్లి పాత్రలో సుహాసిని నటిస్తున్నారు. ఇప్పటివరకు ఏ దర్శకుడు చెప్పని ఒక మంచి సందేశాన్ని దర్శకుడు ఈ చిత్రం ద్వారా చెప్పనున్నారు. ప్రతి ఒక్కరినీ ఆలరించే ఒక మంచి చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది’ అని వివరించారు. శరత్‌ కుమార్‌, సుహాసినితో పాటు నందా, సింగం పులి, సిద్ధిక్‌, గంజా కరుప్పు తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. వేద్‌శంకర్‌ సుగవణం సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి తొరట్టి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం పూజ జరుపుకున్న ‘సమరన్’  చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Updated Date - 2021-09-20T17:08:17+05:30 IST