అక్టోబర్ 9న డాక్టర్
ABN , First Publish Date - 2021-09-20T12:39:04+05:30 IST
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తమిళ నటుడు శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాక్టర్’. కరోనా కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడుతూ...

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తమిళ నటుడు శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాక్టర్’. కరోనా కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి రానుంది. అక్టోబర్ 9న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు.