OTT లో ‘తలైవి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ABN , First Publish Date - 2021-09-26T02:04:40+05:30 IST
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం ‘తలైవి’.. చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. లేడీ ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా.. పేరు తెచ్చుకున్న బాలీవుడ్
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన ‘తలైవి’ చిత్రం.. ఓటీటీలో సందడి చేయనుంది. లేడీ ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా.. పేరు తెచ్చుకున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, ఈ చిత్రంలో జయలలిత పాత్రలో నటించింది. అలాగే ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు.
జయలలిత రాజకీయ ప్రత్యర్థి.. దివంగత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటించారు. అదేవిధంగా జయలలిత నెచ్చెలిగా పేరుగాంచిన శశికళ పాత్రలో పూర్ణ నటించారు. పాన్ ఇండియా మువీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో ఈ చిత్రాన్ని సెప్టెంబరు 26న విడుదల చేయనున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది. ప్రముఖ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తలైవి చిత్రం విడుదల కానుంది.