ఓటీటీలో సూర్య 'జై భీమ్'

ABN , First Publish Date - 2021-08-05T18:42:58+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'జై భీమ్' నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. సూర్య 39వ చిత్రంగా టిజె జ్ఞానవేల్ తెరకెక్కించారు. ఇందులో సూర్యకి సరసన రాజీషా విజయన్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఓటీటీలో సూర్య 'జై భీమ్'

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'జై భీమ్' నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. సూర్య 39వ చిత్రంగా టిజె జ్ఞానవేల్ తెరకెక్కించారు. ఇందులో సూర్యకి సరసన రాజీషా విజయన్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. న్యాయవాదిగా నటిస్తున్న సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం పోరాడే పాత్ర పోషిస్తున్నారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించిన 'జై భీమ్' ఈ ఏడాది నవంబర్‌లో తమిళ, తెలుగు భాషలలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అప్‌డేట్ ఇచ్చింది చిత్ర బృందం. కాగా సూర్య గత చిత్ర చిత్రం సూరారై పోట్రు ( తెలుగులో ఆకాశమే నీ హద్దురా ) కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇక 'జై భీమ్'తో పాటు 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నిర్మిస్తున్న మరో చిత్రాలను అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారానే విడుదల చేయనున్నట్టు సూర్య ప్రకటించారు.  
Updated Date - 2021-08-05T18:42:58+05:30 IST