Sunny Leone: సన్నీలియోన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘షీరో’
ABN , First Publish Date - 2021-08-07T21:23:25+05:30 IST
శ్రీజిత్ విజయన్ దర్శకత్వంలో ప్రఖ్యాత బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. దీనికి ‘షెరో’ అనే టైటిల్ ఖరారు చేశారు.

శ్రీజిత్ విజయన్ దర్శకత్వంలో ప్రఖ్యాత బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. దీనికి ‘షీరో’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని దర్శకుడు శ్రీజిత్ విజయన్ వెల్లడించారు. ఇదే విషయంపై దర్శకుడు శ్రీజిత్ విజయన్ మాట్లాడుతూ ‘‘ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో సన్నీ లియోన్ సారా మైక్ అనే పాత్రలో అమెరికాలో నివసించే భారతీయ సంతతికి చెందిన యువతిగా నటిస్తున్నారు. సెలవులను గడపటానికి అమెరికా నుంచి భారత్‌కు వస్తారు. ఇక్కడకు చేరుకున్న తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, పడిన కష్టాలు ఏంటన్నది ఈ చిత్ర కథ. ఈ అంశాలనే సైకలాజికల్‌గా చిత్రీకరించడం జరిగింది. ఇందులో ఉన్న యాక్షన్ సన్ని వేశాలకు ఎంతో ప్రాధాన్యత వుంది. ఇందుకోసం సన్నీ లియోన్ కఠోర శిక్షణతో రక్షణ చర్యల మధ్య ఈ సన్నివేశాల్లో నటించారు. ‘షీరో’ మూవీని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఈ చిత్రం షూటింగ్ సాఫీగా ముగియడంతో చిత్ర బృందం మొత్తం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు’’ అని అన్నారు.
సన్నీ లియోన్ మాట్లాడుతూ, ‘షెరో వంటి క్లిష్ట పాత్రల్లో నటించేందుకు ఇష్టపడుతున్నాను. ఈ చిత్రం ద్వారా పలు భాషలకు సంబంధించిన భాషా మార్పులను తెలుసుకోగలి గాను. కేరళలోని ఎంతో అంతమైన లొకేషన్లలో చిత్ర షూటింగ్ జరిపాం. నా సినీ ప్రయాణంలో నేను నటించిన మంచి చిత్రాల్లో షెరో ఒకటి. స్టంట్స్ సన్నివేశాల్లో నటించే సమయంలో చిత్ర బృందం పూర్తి సహాయ సహ కారాలు అందించారు’ అని సన్నీ లియోన్ చెప్పింది.