లాఠీ పోరాటం
ABN , First Publish Date - 2021-12-14T06:42:01+05:30 IST
విశాల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం ‘లాఠీ’ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన వీడియోలో విశాల్ కోరమీసంతో ఆకట్టుకున్నారు...

విశాల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం ‘లాఠీ’ సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన వీడియోలో విశాల్ కోరమీసంతో ఆకట్టుకున్నారు. ఏ. వినోద్ కుమార్ దర్శకత్వంలో రమణ, నంద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునయన కథానాయిక. త్వరలో హైదరాబాద్‌లో జరిగే మూడో షెడ్యూల్‌లో స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని విశాల్ ట్విటర్‌లో తెలిపారు. ‘లాఠీ’ సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ‘ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధానాకర్షణ. సమాజంలో మంచి మార్పును తీసుకొచ్చే కథను ఇందులో చూపించబోతున్నాం’ అని నిర్మాతలు తెలిపారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.