ప్రాణాలతో ఉన్నందుకు చింతిస్తున్నా: యాషికా ఆనంద్‌

ABN , First Publish Date - 2021-08-05T15:31:00+05:30 IST

ప్రాణాలతో ఉన్నందుకు చింతిస్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు యాషికా ఆనంద్‌. ఇటివల మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోలీవుడ్‌ నటి యాషికా ఆనంద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రాణాలతో ఉన్నందుకు చింతిస్తున్నా:   యాషికా ఆనంద్‌

ప్రాణాలతో ఉన్నందుకు చింతిస్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు యాషికా ఆనంద్‌. ఇటివల మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోలీవుడ్‌ నటి యాషికా ఆనంద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఈమె ప్రాణ స్నేహితురాలు మృత్యువాతపడ్డారు. అలాగే, మరో ఇద్దరు స్నేహితులు గాయపడ్డారు. అయితే, ఆగస్టు 4వ తేదీ యాషికా ఆనంద్‌ పుట్టిన రోజు. తన పుట్టినరోజు వేడుకలను ఎవరూ సెలబ్రేట్‌ చేయొద్దని ఆమె తన అభిమానులకు విఙ్ఞప్తి చేసింది. 


ఈ సందర్భంగా ఆమె ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ''ఇప్పుడు నేను నా జీవితంలో ఎన్నడూలేని విధంగా బాధ అనుభవిస్తున్నాను. అది మాటల్లో చెప్పలేను. నేనింకా ప్రాణాలతో ఉన్నందుకు లోలోన కుమిలి పోతున్నాను. మహాబలిపురం వద్ద జరిగిన కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలో లేక నా ప్రాణ స్నేహితురాలిని కోల్పోయినందుకు భగవంతుడిని నిందించాలో అర్థం కావడం లేదు. పావనీ.. మా నుంచి శాశ్వతంగా దూరమయ్యావు. ప్రతి క్షణం నిన్ను మిస్‌ అవుతున్నా. నీవు నన్ను ఎప్పటికీ క్షమించవని నాకు తెలుసు. కానీ, నీ కుటుంబాన్ని బాధాకరమైన స్థితిలోకి నెట్టినందుకు నన్ను క్షమించు. నువ్వు మళ్ళీ మా మధ్యకు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అంటూ యాషికా ఆనంద్‌ ఆ పోస్టులో పేర్కొంది. 

Updated Date - 2021-08-05T15:31:00+05:30 IST