'బీస్ట్' కోసం శివకార్తికేయన్ సాహిత్యం
ABN , First Publish Date - 2021-08-14T17:56:02+05:30 IST
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బీస్ట్'. ఈ మూవీ కోసం మరో యంగ్ హీరో శివకార్తికేయన్ సాహిత్యం అందించబోతున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బీస్ట్'. ఈ మూవీ కోసం మరో యంగ్ హీరో శివకార్తికేయన్ సాహిత్యం అందించబోతున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ 65వ గా రూపొందుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తూనే దర్శక, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా 'బీస్ట్' సినిమా కోసం ఓ పాట రాశారు.
ఇప్పటికే గీత రచయితగా పలు సినిమాల్లో శివ కార్తికేయన్ పాటలు రాశారు. దర్శకుడు నెల్సన్ - శివ కార్తికేయన్ మంచి స్నేహితులు. ఈ కారణంగానే శివ కార్తికేయన్ ముందునుంచి నెల్సన్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో భాగం అవుతున్నారు. సెల్సన్ డెబ్యూ మూవీ 'కొలమావు' కోసం శివ కార్తికేయన్ ''కల్యాణ వయసు'' అనే పాటను రాశారు. ఇప్పుడు సెల్వన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన 'డాక్టర్' సినిమాలో అన్ని పాటలను రాశారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
