సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సూర్యను డైరెక్ట్‌ చేయనున్న శివ

ABN, First Publish Date - 2021-09-23T17:49:41+05:30

ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ శివ ‘అణ్ణాత్త’ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అలాగే, హీరో సూర్య ఇపుడు పాండిరాజ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ శివ ‘అణ్ణాత్త’ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అలాగే, హీరో సూర్య ఇపుడు పాండిరాజ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. దీని తర్వాత జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ దర్శకత్వంలో సూర్య తదుపరి ప్రాజెక్టు ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, అనూహ్యంగా ఇప్పుడు మాస్‌ డైరెక్టర్‌ శివ పేరు తెరపైకి వచ్చింది. ‘అణ్ణాత్త’ రిలీజైన తర్వాత సూర్య హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు శివ ప్లాన్‌ చేసినట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే పనులు మొదలుపెట్టారట. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్‌ కోసం ప్రత్యేక సెట్‌ నిర్మాణం చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ‘అణ్ణాత్త’కు ముందే సూర్యతో శివ ఒక మూవీని ప్లాన్‌ చేశారు. కానీ, రజనీకాంత్‌ నుంచి శివకు పిలుపు వచ్చింది. దీంతో సూర్య వద్ద అనుమతి తీసుకుని ‘అణ్ణాత్త’ ప్రాజెక్టును శివ పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ పూర్తికావడంతో గతంలో అనుకున్న ప్రాజెక్టును హీరో సూర్యతో పూర్తి చేసేందుకు డైరెక్టర్‌ శివ సిద్ధమయ్యారు.

Updated Date - 2021-09-23T17:49:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!