ఉదారత చాటుకున్న Vijay Sethupathi.. ఏకంగా కోటి రూపాయల విరాళం..!

ABN , First Publish Date - 2021-10-04T19:39:58+05:30 IST

తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తన పెద్ద మనసు చాటుకున్నాడు.

ఉదారత చాటుకున్న Vijay Sethupathi.. ఏకంగా కోటి రూపాయల విరాళం..!

తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తన పెద్ద మనసు చాటుకున్నాడు. దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెప్సీ) భవన నిర్మాణానికిగానూ కోటి రూపాయలను విరాళంగా అందించాడు. హీరోయిన్ రోజా భర్త, పెప్సీ అధ్యక్షుడు ఆర్‌కె సెల్వమణికి ఆ మొత్తాన్ని అందజేశాడు. చెన్నైలోని స్థానిక ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన సమావేశానికి హాజరైన విజయ్ సేతుపతి ఆ చెక్కును సెల్వమణికి అందించాడు. 


ఫెఫ్సీలో స‌భ్యులుగా ఉన్న కార్మికుల కోసం ఓ కాల‌నీ నిర్మించాలని సమాఖ్య ఎప్పట్నుంచో అనుకుంటోంది. అందుకోసం సినీ ప్రముఖులందరూ త‌మ వంతు సాయాన్ని అందించాల‌ని సెల్వ‌మ‌ణి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన విజయ్ సేతుపతి వెంటనే తన వంతు విరాళంగా కోటి రూపాయ‌ల‌ను అందించారు. యు.వి.క‌మ్యూనికేష‌న్స్ అనే సంస్థ కూడా 31 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా నటుడు విజయ్‌సేతుపతికి సెల్వమణి కృతజ్ఞతలు తెలిపారు.    

Updated Date - 2021-10-04T19:39:58+05:30 IST