సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సత్యజ్యోతి ఫిలిమ్స్‌ కొత్త చిత్రం ‘అన్బరివు’

ABN, First Publish Date - 2021-04-18T03:24:27+05:30

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సత్యజ్యోతి ఫిలిమ్స్‌ కొత్తగా నిర్మిస్తున్న చిత్రానికి ‘అన్బరివు’ అనే టైటిల్‌ ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఆ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అశ్విన్‌ రామ్‌ తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సత్యజ్యోతి ఫిలిమ్స్‌ కొత్తగా నిర్మిస్తున్న చిత్రానికి ‘అన్బరివు’ అనే టైటిల్‌ ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఆ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అశ్విన్‌ రామ్‌ తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టీజీ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా, కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా, కమర్షియల్‌ హుంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం తగ్గకుండా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హిప్‌హాప్‌ ఆది హీరోగా నటిస్తుండగా, ఇతర పాత్రల్లో సీనియర్‌ నటీనటులు నెపోలియన్‌, సాయికుమార్‌, ఆషా శరత్‌, విదార్థ్‌, విజయ్‌ టీవీ దీనా, కాశ్మీరా, శివానీ రాజశేఖర్‌ తదితరులు నటిస్తున్నారు. 


పూర్తి గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రం తమిళ సినీ ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ చూడని రష్యాలోని అందమైన లొకేషన్లలో షూటింగు జరిపారు. శివానీ రాజశేఖర్‌ కనిపించే సన్నివేశాలన్నీ రష్యా బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తాయి. హాస్యం, ప్రేమ, సెంటిమెంట్‌, పట్టణ, గ్రామీణం ఇలా అన్ని అంశాలతో కుటుంబ సభ్యులందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా   హిప్‌హాప్‌ ఆది.. సంగీతం కూడా సమకూర్చుతున్నారు. ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగిలిన షూటింగు, డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌, ఆడియో రిలీజ్‌ వేడుకలను భారీగా నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-04-18T03:24:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!