వినాయకచవితికి టీవీలో ‘సార్బట్టా పరంబరై’?
ABN , First Publish Date - 2021-08-29T20:50:17+05:30 IST
హీరో ఆర్య, హీరోయిన్ తుషారా విజయన్ నటించిన చిత్రం ‘సార్బట్టా పరంబరై’. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 22న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను కలైంజర్ టీవీ

హీరో ఆర్య, హీరోయిన్ తుషారా విజయన్ నటించిన చిత్రం ‘సార్బట్టా పరంబరై’. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 22న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను కలైంజర్ టీవీ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ శుక్రవారం పూర్తయింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 10వ తేదీన వినాయకచవితిని పురస్కరించుకుని ఈ సినిమా టీవీలో ప్రసారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.