విజయ్‌కు విలన్‌గా ‘డాన్సింగ్‌ రోస్‌’

ABN, First Publish Date - 2021-08-12T03:06:29+05:30

స్టార్‌ హీరో విజయ్‌ - దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బీస్ట్‌’. పూజా హెగ్డే హీరోయిన్‌ కాగా నిర్మాత కళానిధి మారన్‌. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం

విజయ్‌కు విలన్‌గా ‘డాన్సింగ్‌ రోస్‌’
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్‌ హీరో విజయ్‌ - దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బీస్ట్‌’. పూజా హెగ్డే హీరోయిన్‌ కాగా నిర్మాత కళానిధి మారన్‌. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో రెండో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. త్వరలో మూడో షెడ్యూల్‌ కోసం విదేశాలకు వెళ్ళేందుకు చిత్రయూనిట్ ప్లాన్‌ చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ముగ్గురు విలన్లు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒక విలన్‌గా మలయాళ నటుడు షైన్‌ టామ్‌ సాకో నటిస్తున్నారు. రెండో విలన్‌గా కోలీవుడ్‌ దర్శకుడు సెల్వరాఘవన్‌ను ఇటీవలే ఆన్‌ బోర్డులోకి తీసుకున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇపుడు మూడో విలన్‌ పేరు తెరపైకి వచ్చింది. 


దర్శకుడు పా.రంజిత్‌ - హీరో ఆర్య, హీరోయిన్‌ దుషారా విజయన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సార్బట్టా పరంపరై’ చిత్రంలో డాన్సింగ్‌ రోస్‌ అనే పాత్రలో అద్భుతంగా నటించి ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్న సబీర్‌ కలరక్కల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈయన గతంలో ‘పేట’, ‘టెడ్డి’, ‘అడంగమరు’ తదితర చిత్రాల్లో నటించారు. ఈయన ‘సార్బట్టా పరంపరై’ చిత్రం కోసం తన శరీర బరువును అమితంగా తగ్గించి నిజమైన బాక్సర్‌ను తలపిస్తూ నటించారు. అందుకే సబీర్‌ను ‘బీస్ట్‌’ చిత్రంలో మరో విలన్‌గా దర్శకుడు ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Updated Date - 2021-08-12T03:06:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!