సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మరోలుక్‌తో సమంత హల్‌చల్‌!

ABN, First Publish Date - 2021-11-16T17:33:04+05:30

సమంత కెరీర్‌ మంచి జోరుగా సాగుతుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆమె తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్న ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ చిత్రంలో సమంత కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత కెరీర్‌ మంచి జోరుగా సాగుతుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆమె తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి, నయనతార కీలక  పాత్రలు పోషిస్తున్న ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ చిత్రంలో సమంత కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర కటిజా. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సమంత కూడా ఆ పోస్టర్‌ను షేర్‌ చేసి ‘కటిజా పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చాలా ప్రత్యేకమైన పాత్ర ఇది’ అని సమంత్‌ రాసుకొచ్చారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. మొదట ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందని ప్రచారం జరిగింది. అయితే థియేటర్‌లోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ చిత్రానికి విఘ్నేశ్‌ శివన్‌, నయనతార, లలిత్‌కుమార్‌ నిర్మాతలు. 




Updated Date - 2021-11-16T17:33:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!