అంతరిక్షంలో హీరోయిన్, దర్శకుడు! సినిమా షూటింగ్ కోసం బయలుదేరిన రాకెట్!

ABN , First Publish Date - 2021-10-06T03:44:34+05:30 IST

అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్‌కి అంతా సిద్ధమైపోయింది! రష్యాకు చెందిన ‘సోయజ్ ఎంఎస్ 19’ రాకెట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దిశగా దూసుకుపోయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.52 గంటలకు రష్యన్ యాక్ట్రస్ యులియా పెరేసిల్డ్‌తో పాటూ డైరెక్టర్ క్లిమ్ షిపెన్కో అంతరిక్ష కేంద్రంలో కాలుమోపారు. వాళ్లతో పాటూ రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు కూడా ఉన్నారు.

అంతరిక్షంలో హీరోయిన్, దర్శకుడు! సినిమా షూటింగ్ కోసం బయలుదేరిన రాకెట్!

అంతరిక్షంలో తొలి సినిమా షూటింగ్‌కి అంతా సిద్ధమైపోయింది! రష్యాకు చెందిన ‘సోయజ్ ఎంఎస్ 19’ రాకెట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దిశగా దూసుకుపోయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.52 గంటలకు రష్యన్ యాక్ట్రస్ యులియా పెరేసిల్డ్‌తో పాటూ డైరెక్టర్ క్లిమ్ షిపెన్కో అంతరిక్ష కేంద్రంలో కాలుమోపారు. వాళ్లతో పాటూ రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు కూడా ఉన్నారు. 

నటి యులియా, దర్శకుడు క్లిమ్ 12 రోజుల పాటూ ఇంటర్నేషనల్ స్సేస్ స్టేషన్‌లో (ఐఎస్ఎస్‌లో) షూటింగ్ చేయనున్నారు. కథ ప్రకారం, అంతరిక్షం కేంద్రంలోని ఒక సభ్యుడికి హృదయ సంబంధమైన సమస్య తలెత్తితే, వైద్యం అందించేందుకు హీరోయిన్ ఐఎస్ఎస్‌కు చేరుకుంటుంది. దానికి సంబంధించిన సన్నివేశాల్ని దర్శకుడు క్లిమ్ భూమికి ఆవల చిత్రీకరించనున్నాడు. ‘ఛాలెంజ్‘ పేరుతో తెరకెక్కుతోన్న ఈ రష్యన్ మూవీ తొలి ‘అంతరిక్షం చిత్రం’గా చరిత్రలో నిలవనుంది! 

పోయిన సంవత్సరం హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ ‘స్పేస్ మూవీ’ని అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఐఎస్ఎస్‌కు చేరుకుని అక్కడ షూటింగ్ చేస్తామని చెప్పాడు. కానీ, అంతకంటే ముందే రష్యన్ ప్రభుత్వ సాయంతో రూపొందుతోన్న ‘ఛాలెంజ్’ మూవీ నింగికి చేరిపోయింది. ‘ఫస్ట్ స్పేస్ మూవీ’గా రికార్డ్ స‌‌ృష్టించింది. అక్టోబర్ 17న నటి యులియా, దర్శకుడు క్లిమ్ భూమ్మీదకు తిరిగి వస్తారని అంచనా వేస్తున్నారు.       

తమ ‘ఛాలెంజ్’ మూవీతో అమెరికాకు ఛాలెంజ్ విసిరిన రష్యా మరోసారి కోల్డ్ వార్ కాలం నాటి యూఎస్ వర్సెస్ యూఎస్ఎస్ఆర్ అంతరిక్ష పోటీని గుర్తుకు చేసింది!  

Updated Date - 2021-10-06T03:44:34+05:30 IST