రితికా సింగ్‌ కూడా రెచ్చిపోతోంది

ABN , First Publish Date - 2021-10-29T03:07:37+05:30 IST

స్టార్‌ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా అవకాశాలను చేజిక్కించుకోవాలంటే ఎక్స్‌పోజింగ్‌ చేయక తప్పదన్న సూక్ష్మాన్ని గ్రహించిన రితికా సింగ్‌ ఇతర హీరోయిన్లకు ధీటుగా అందాల ఆరబోతకు శ్రీకారం చుట్టింది. ఇందుకు నిదర్శనమే ఆమె తాజాగా

రితికా సింగ్‌ కూడా రెచ్చిపోతోంది

స్టార్‌ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా అవకాశాలను చేజిక్కించుకోవాలంటే ఎక్స్‌పోజింగ్‌ చేయక తప్పదన్న సూక్ష్మాన్ని గ్రహించిన రితికా సింగ్‌ ఇతర హీరోయిన్లకు ధీటుగా అందాల ఆరబోతకు శ్రీకారం చుట్టింది. ఇందుకు నిదర్శనమే ఆమె తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన గ్లామర్‌ ఫొటోలు. వాటిని చూసిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. సుధ దర్శకత్వం వహించిన ‘ఇరుదిచుట్రు’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన బాక్సింగ్‌ క్రీడాకారిణి రితికా సింగ్‌. ఈ చిత్రం విజయం సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. 


అయితే, ‘అండవన్‌ కట్టలై’, ‘శివలింగా’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టాయి. ఆ తర్వాత అశోక్‌ సెల్వన్‌తో కలిసి నటించిన ‘ఓ మై కడవులే’ చిత్రంలో రితికా సింగ్‌ నటన సూపర్బ్ అనేలా కామెంట్స్ వచ్చాయి‌. ప్రస్తుతం ‘బాక్సర్‌’, ‘పిచ్చైకారన్‌-2’ చిత్రాల్లో నటిస్తోంది. అయితే, చిన్న హీరోలతో కాకుండా స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించాలని పరితపిస్తున్న ఆమె.. ఇందుకోసం కమర్షియల్‌ హీరోయిన్‌ అనే భావన తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చింది.  ఇందుకోసం ఆమె ఎక్స్‌పోజింగే ఏకైక ఆయుధంగా భావించి, ప్రత్యేక ఫొటో షూట్‌లను నిర్వహిస్తూ, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. ఈ ఫొటోలు చూసైనా పెద్ద హీరోలు ఆమెకు ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం.

Updated Date - 2021-10-29T03:07:37+05:30 IST