ధనుష్‌కి జంటగా రాశి ఖన్నా..!

ABN , First Publish Date - 2021-08-03T15:11:09+05:30 IST

బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా తెలుగు కంటే తమిళ సినిమాలలోనే ఎక్కువగా చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి జంటగా నటించే అవకాశాన్ని రాశిఖన్నా అందుకుందని టాక్ మొదలైంది.

ధనుష్‌కి జంటగా రాశి ఖన్నా..!

బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా తెలుగు కంటే తమిళ సినిమాలలోనే ఎక్కువగా చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి జంటగా నటించే అవకాశాన్ని రాశిఖన్నా అందుకుందని టాక్ మొదలైంది. ఆమె ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యకి జంటగా 'థ్యాంక్యూ' మూవీ చేస్తోంది. అలాగే గోపీచంద్ -మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పక్కా కమర్షియల్'లోను, తమిళంలో 'అరణ్‌మణై 3', విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతితో 'తుగ్లక్‌ దర్బార్' సినిమాలు చేస్తోంది. ఇప్పటికే 'అరణ్‌మణై 3', విజయ్‌ సేతుపతిల మూవీ  షూటింగ్స్‌ను పూర్తి చేసింది. తాజాగా కార్తీ నటిస్తున్న 'సర్దార్‌' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ధనుష్‌ హీరోగా మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఓ సినిమాలో కూడా అవకాశం అందుకుందట. కాగా బాలీవుడ్‌లో ప్రస్తుతం షాహిద్‌ కపూ్‌తో 'సన్నీ', అజయ్‌ దేవగణ్‌ 'రుద్ర' వెబ్‌ సిరీస్‌ చేస్తూ బిజీగా ఉన్నారు రాశి ఖన్నా.  

Updated Date - 2021-08-03T15:11:09+05:30 IST