ఒక్కో సినిమాకు రూ. 100కోట్ల పారితోషికం తీసుకుంటున్న రామ్ చరణ్

ABN , First Publish Date - 2021-12-27T20:48:16+05:30 IST

రంగస్థలం, ధ్రువ వంటి సినిమాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన నటుడు రామ్ చరణ్. అతడు హీరోగా నటించబోయే

ఒక్కో సినిమాకు రూ. 100కోట్ల పారితోషికం తీసుకుంటున్న రామ్ చరణ్

రంగస్థలం, ధ్రువ వంటి సినిమాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన నటుడు రామ్ చరణ్. అతడు హీరోగా నటించబోయే సినిమాలకు భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ తదుపరి చిత్రాలన్ని పాన్ ఇండియాగా తెరకెక్కబోతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ విడుదల అనంతరం మార్కెట్ పరిధి కూడా విస్తృతమవుతుంది. అందువల్ల భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీకి దాదాపుగా రూ.100కోట్ల పారితోషికం తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోయే చిత్రంలోను అతడు నటించనున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఈ మూవీకి కూడా రూ.100కోట్లను ఛార్జ్ చేసినట్టు సమాచారం.

Updated Date - 2021-12-27T20:48:16+05:30 IST