Rajinikanth Foundation: 100 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణను ఇస్తామంటున్న రజినీ కాంత్
ABN , First Publish Date - 2021-12-27T22:58:57+05:30 IST
మేనరిజం, స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఆసియాలోనే అత్యధిక

మేనరిజం, స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడాయన . రజినీలో మంచి మానవతావాది దాగున్న సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. అతడు రజినీకాంత్ పౌండేషన్ ద్వారా 4గురికి చేతనైన సాయం చేస్తున్నారు. తాజాగా ఆ పౌండేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
‘‘ పద్మ విభూషణ్, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ ద రజినీకాంత్ పౌండేషన్ ’ ను స్థాపించారు. ఈ పౌండేషన్ ద్వారా నిరుపేద వర్గాల వారికి ఉన్నత చదువుల నిమిత్తం సహాయం అందిస్తారు. అసమానతలను రూపుమాపడానికి కృషిచేస్తారు. గ్లోబల్‌గా మా విజన్ ఉన్నప్పటికి ప్రస్తుతం తమిళనాడుకు మాత్రమే పరిమితమై పనిచేస్తున్నాం ’’ అని పౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
‘‘ తమిళనాడు ప్రజల ఫలితంగానే రజినీకాంత్‌కు కీర్తి, ప్రతిష్ఠలు లభించాయి. అందువల్ల పౌండేషన్ అందించే ఏ సహాయం అయినా తమిళనాడులోనే ప్రారంభమవుతుంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్‌పీఎస్‌సీ ) నిర్వహించే గ్రూప్ పరీక్షలకు ఉచితంగా 100మందికి శిక్షణను అందిస్తాం. సూపర్ 100బ్యాచ్‌కి రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించాం ’’ అని ప్రతినిధులు పేర్కొన్నారు.
రజినీకాంత్ తాజాగా అణ్ణాత్తే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా తదితరులు కీలకపాత్రలు పోషించారు.
