లారెన్స్ ‘రుద్రన్’ విడుదల తేదీ ఖరారు
ABN , First Publish Date - 2021-08-29T02:46:16+05:30 IST
‘పొల్లాదవన్’, ‘ఆడుగళం’, ‘జిగర్‌తండా’ వంటి చిత్రాలను నిర్మించిన ఫైవ్‌స్టార్ కదిరేశన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రన్’. రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా..

‘పొల్లాదవన్’, ‘ఆడుగళం’, ‘జిగర్‌తండా’ వంటి చిత్రాలను నిర్మించిన ఫైవ్‌స్టార్ కదిరేశన్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రన్’. రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించే ఈ చిత్రంలో శరత్ కుమార్, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది 2022 ఏప్రిల్ 14వ తేదీ (తమిళ ఉగాది)న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.