రాశీఖన్నాకు ఎలాంటి వరుడు కావాలంటే..?
ABN, First Publish Date - 2021-09-07T00:56:55+05:30
హీరోయిన్ రాశీఖన్నా కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా ఖాళీగా లేదు. ‘ఇమైక్కా నొడిగల్’, ‘అడంగమరు’, ‘సంఘతమిళన్’ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే, ‘తుగ్లక్ దర్బార్’, ‘అరణ్మనై-3’ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఇవికాకుండా
కోలీవుడ్‌లో వరుస సినీ అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ రాశీఖన్నా కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా ఖాళీగా లేదు. ‘ఇమైక్కా నొడిగల్’, ‘అడంగమరు’, ‘సంఘతమిళన్’ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే, ‘తుగ్లక్ దర్బార్’, ‘అరణ్మనై-3’ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఇవికాకుండా ‘సర్దార్’, ‘తిరుచిట్రాంబలం’ వంటి చిత్రాల్లో రాశీఖన్నా నటిస్తోంది. అయితే, ఈమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తనకు ఎలాంటి భర్త కావాలో వెల్లడించింది. తనలాగే దేవుడిపై నమ్మకంతోపాటు అధిక భక్తిభావం కలిగిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు చెప్పింది. పైగా తనకు కాబోయే భర్త పెద్ద అందగాడు కాకపోయినప్పటికీ ఆథ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలంది. ఇలాంటి సుగుణాలు కలిగిన వ్యక్తినే తాను వరుడిగా ఎంచుకుని పెళ్ళి చేసుకుంటానని రాశీఖన్నా చెప్పుకొచ్చింది.